- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన ఎస్సై రిమాండ్
ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కేసులో ఎస్సై సురేష్‌ను కూకట్పల్లి పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు.

దిశ, కూకట్పల్లి : ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కేసులో ఎస్సై సురేష్‌ను కూకట్పల్లి పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన సురేష్ ఓ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడంతో యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎస్సై సురేష్ కోసం అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించగా సురేష్ తప్పించుకుని తిరుగినట్టు సమాచారం. సురేష్ ను బుధవారం ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు చేసిన యువతి సైతం పోలీసు శాఖలో పని చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎస్సై సురేష్ 2020లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించగా కూకట్పల్లి నుంచి బదిలిపై వెళ్లి కల్లూరు పోలీస్ స్టేషన్లో పని చేస్తుండగా యువతి ఫిర్యాదు ఆధారంగా ఉన్నతాధికారులు సురేష్‌ను సస్సెండ్ చేశారు.






