- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకే పార్కులు
by Sridhar Babu |
ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కులు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

X
దిశ, కూకట్పల్లి : ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కులు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్ డివిజన్లోని ఫ్రీడమ్ పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బాలాజీనగర్ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు థీం పార్కును అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. పార్కు అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ఏఎంఓహెచ్ కార్తిక్, డీఈ శ్రీదేవి, ఏఈ సామాల శ్రీనివాస్, స్థానిక నాయకులు ప్రభాకర్, ఆరోగ్యరెడ్డి పాల్గొన్నారు.
Next Story






