నూత‌నంగా నిర్మించే ఇండ్లే వారి టార్గెట్..!

by Ratna Kumari |

కొత్త‌గా క‌ట్టుకున్న వారి ఇళ్ల‌లో క‌రెంట్ వైర్లు దొంగిలించి అమ్ముకుంటున్న ముఠాను స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

నూత‌నంగా నిర్మించే ఇండ్లే వారి టార్గెట్..!
X

దిశ, మేడిపల్లి : కొత్త‌గా క‌ట్టుకున్న వారి ఇళ్ల‌లో క‌రెంట్ వైర్లు దొంగిలించి అమ్ముకుంటున్న ముఠాను స్థానికులు పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోడుప్పల్ సర్కిల్ మెక్డోల్ కాలనీలో కొత్తగా కట్టిన ఇళ్ల‌లో కరెంట్ వైర్లు దొంగిలించి అమ్ముకుంటూ ఇంటి ఓనర్లకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాణం లో ఉన్న ఇంటిలోకి చొరబడిన దొంగల్ని గుర్తించి పట్టుకొని పోలీస్ స్టేషన్ లో స్థానికులు అప్పగించారు. ఇలాంటి దొంగతనాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు ఒకటైన జరుగుతున్నాయని, ఇలాంటి చిల్లర దొంగలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న బిల్డింగ్ లే వీరి టార్గెట్ అని ,ఎలక్ట్రికల్ వైర్లు దొంగిలించి ఎక్కడికి అక్కడ కట్ చేసి పనికి రాకుండా చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, కాపర్ రేట్ పెరగడంతో ఎలక్ట్రిక్ వైర్లు దొంగతనాలకు పడుతున్నార‌ని, ఈ ముఠా అంతా బోడుప్పల్ లోని బుడగ జంగాల కాలనీలో నివాసం ఉంటున్నారని సమాచారం. చూడడానికి ఇది చిన్న సమస్య .కానీ దాని వెనకాల ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో ఇంటి ఓనర్ కు మాత్రమే తెలుసు అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన‌ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Next Story