నాగపూర్ టు హైదరాబాద్.. గంజాయి విక్రయితల అరెస్టు

by velandi.Saikiran |

నాగపూర్ టు హైదరాబాద్.. గంజాయి విక్రయితల అరెస్టు
X

దిశ, నాచారం: నిషేధిత గంజాయి విక్రయాలు చేపడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నాచారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మౌలాలి హౌసింగ్ బోర్డు లక్ష్మీనగర్ కాలనీ కి చెందిన తన్నేరు శ్రీనివాసరావు కుమారుడు గోపీ రాజు(19), కర్ణాటక బీదర్ చెందిన హోక్రాన చంద్రశేఖర్( 20) మల్లాపూర్ వెంకటరమణ కాలనీ లో నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా ల్యాబ్ టెక్నీషియన్. మల్లాపూర్ సూర్యనగర్ జీహెచ్‌ఎంసీ పార్క్ సమీపంలో గంజాయి అమ్మకం చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి 104 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపించారు. నిందితులు గంజాయిని మహారాష్ట్ర రాష్ట్రం, నాగపూర్ నుండి తెచ్చినట్లు విచారణలో వెల్లడించారు.

Next Story