- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ దొంగలు అరెస్ట్
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెల్ ఫోన్ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, ఉప్పల్ : ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెల్ ఫోన్ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ కు చెందిన కొత్తకపు లింగ రెడ్డి(33) ఉప్పల్ లో మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియంకు వచ్చి వాటర్ తాగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన ప్యాంట్ జేబులో ఉన్న ఒప్పో మొబైల్ ఫోన్‌ను దొంగిలించినట్లు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఉప్పల్ పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. కలకత్తాకు చెందిన మొహమ్మద్ బాబర్, (35) సద్దాం హుస్సేన్ (28) పట్టుకున్నారు. వీరి వృత్తి చేతితో చీరలు తయారు చేసే కార్మికులు. నిందితులను పట్టుకొని సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






