బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలి

by velandi.Saikiran |

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలలో బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి

బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలి
X

దిశ, కూకట్​పల్లి: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలలో బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్​ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం కూకట్​పల్లి క్యాంప్​ కార్యాలయంలో ​సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, జూబ్లిహిల్స్​ అసెంబ్లి నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్​ బాధ్యతలు పార్టీ అధిష్టానం తమకు అప్పగించిందని తెలిపారు. అభ్యర్థి గెలుపున‌కు కూకట్​పల్లి కార్పొరేటర్​లు, ముఖ్య నాయకులు కృషి చేయాలని అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకు వెళుతు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. కాంగ్రెస్​ పార్టీ నాయకులు, ప్రభుత్వం చేస్తున్న తప్పులు, అరాచకాలను ప్రజలకు వివరిస్తు బీఆర్​ఎస్​ అభ్యర్థి మాగంటి సునీత విజయం కోసం కృషి చేయాలని కోరారు.

Next Story