ఈటల రాజేందర్​ను కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by velandi.Saikiran |

ఈటల రాజేందర్​ను కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు

ఈటల రాజేందర్​ను కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి : మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్​ను కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం గాజుల రామారాం సర్వే నంబర్​ 307లోని 317 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం కాకుండా చూడాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదే విధంగా కూకట్​పల్లి నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు అయిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్​ సభ్యుడిగా సహకరించాలని విన్న‌వించారు. ప్రభుత్వ భూములలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల జోలీకి వెళ్లకుండా పట్టా భూములు పేరుతో ప్రభుత్వ భూములను చెరబట్టిన వారిపై చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకు వెళ్లి చర్యలు తీసుకోవాలని కోరారు. కూకట్​పల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎంపి నిధులు మంజూరు చేయాలని కోరుతు వినతి పత్రం అందజేశారు.

Next Story