- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్న అదృశ్యమైన అనూష మృతదేహం లభ్యం
గత కొద్ది రోజుల నుంచి విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.... latest news of missing young woman

దిశ, ఉప్పల్: గత కొద్ది రోజుల నుంచి విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రామంతపూర్ ఇందిరానగర్ కు చెందిన గుడివైన అనూష(19) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న అదృశ్యమై ఈరోజు మృతదేహంగా కనిపించింది. అనూష ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ తెలువలేదని ఆమె తల్లి సునీత బుధవారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఒకరోజు గడవక ముందే గుడివైన అనూష మృతదేహం లభ్యం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివైన అనూష 2020 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసి అప్పటి నుండి నీట్ కి ప్రిపేర్ అవుతుంది. రెండు సార్లు ఎగ్జామ్ రాసినా సీట్ రాలేదు. ఇది మూడో సంవత్సరం నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుంది. కానీ నీట్ పై ఆమెకు ఆసక్తి లేకపోయినా, అదే చదవాలని తల్లి సునీత మందలించడంతో మనస్తాపానికి గురైన అనూష మంగళవారం తెల్లవారు జామున 5 గంటలకు రామంతపూర్ చిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.






