శాన్వి కన్స్ట్రక్షన్ లో గుడిసెలు దగ్ధం

by Kema Shiva Kumar |

బాచుపల్లిలోని శాన్వి కన్స్ట్రక్షన్ కంపెనీలో మంగళవారం భారీ స్థాయిలో కార్మికుల గుడిసెలు దగ్ధమయ్యాయి.

శాన్వి కన్స్ట్రక్షన్ లో గుడిసెలు దగ్ధం
X

దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లిలోని శాన్వి కన్స్ట్రక్షన్ కంపెనీలో మంగళవారం భారీ స్థాయిలో కార్మికుల గుడిసెలు దగ్ధమయ్యాయి. కంపెనీలో లేబర్ గా పనులు చేస్తున్న కొందరికి గుడిసెలు ఏర్పాటు చేశారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా గుడిసెలకు నిప్పంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 50 వరకూ కార్మికులు నివసిస్తున్న గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.

అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కార్మికుల నిత్యావసర వస్తువులు, బట్టలు కాలి బూడిదై పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఘటనపై కార్మిక, మున్సిపల్, రెవిన్యూ, పోలీస్ శాఖలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు

కార్మికుల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ, బాధ్యత లేకుండా తమ ఇష్టానుసారం శాన్వి కన్స్ట్రక్షన్ కంపెనీ కనీస నిబంధనలు పాటించకుండా గుడిసెలు ఏర్పాటు చేసిందని నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్ అన్నారు. కార్మికులకు కనీస నివాసాలు ఏర్పాట్లు చేయడంలో శాన్వి కన్స్ట్రక్షన్ విఫలం కావడం వల్లే భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఘటనపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి శాన్వి కన్స్ట్రక్షన్ యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story