సాములోరి లగ్గం చూసేదెలా..?.. ఎండలోనే రోడ్లపై భక్తులు

by Disha Web Desk 23 |
సాములోరి లగ్గం చూసేదెలా..?.. ఎండలోనే రోడ్లపై భక్తులు
X

దిశ, వేములవాడ : తెలంగాణ లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారంనుండి శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు కల్పించామని చెప్పుకునే అధికారులు నేడు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ప్రకటన లకే పరిమితమయ్యారు. స్వామివారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు పూర్తిగా భక్తులు నిండిపోయింది. వేల సంఖ్యలో భక్తులు రోడ్లపై ఎండలో ఉండిపోయారు. స్వామి వారి కళ్యాణం తిలకించడానికి సరైన సౌకర్యాలు లేక మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఎండ వేడిలో ఆలయం ముందు కళ్యాణం చూడలేక, కనీస సౌకర్యల గురించి ఏ అధికారిని సంప్రదించాలో తెలియక, ఎంతో దూరం నుంచి వచ్చిన వృద్ధులు ఇంత దూరం వచ్చి శివయ్య నీ లగ్గం సూడ పోత్తి మీ అని నిస్సహాయస్థితిలో రోడ్లపై నిలబడిపోయారు.


Next Story

Most Viewed