- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా డిగ్రీ కళాశాలలో హెల్త్ క్యాంప్
శామీర్ పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో... Health camp held

దిశ, శామీర్ పేట: శామీర్ పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థినులకు ఇండస్ ఇండ్ బ్యాంక్, మొబైల్ మెడికల్ యూనిట్, ఆరోగ్య దూత ఆధ్వర్యంలో వివిధ రకాల హెల్త్ క్యాంప్స్ నిర్వహించారు. నాలుగు విభాగాలుగా క్యాంప్స్ ని నిర్వహించి జనరల్ స్కానింగ్, దంత సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు, రక్త పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న విద్యార్థినులకు ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. ఈ క్యాంప్ లో ఆరోగ్య దూత తరపున విచ్చేసినటువంటి డాక్టర్ దీపిక మెడికల్ ఆఫీసర్, డాక్టర్ వినయ్ బాబు దంత వైద్యులు, డాక్టర్ జవహర్లాల్ కంటి వైద్యులు, కళాశాల వైద్యురాలు డాక్టర్ భాగ్యలక్ష్మి, ఆపరేషన్ మేనేజర్ సురేష్, సంగీత, మౌనిక, అనిత ల్యాబ్ టెక్నీషియన్స్ వారి విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించరు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివాని, శ్వేత, జ్యోతి, అంకిత శ్రీ, అధ్యాపక బృందం ఉత్సాహంగా పాల్గొని హెల్త్ క్యాంప్స్ ను విజయవంతం చేశారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇస్రాత్ తెలిపారు.






