- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలి..
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షుడు శ్రవణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, మేడ్చల్ టౌన్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షుడు శ్రవణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు సుశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ డిపో నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
అనంతరం ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఆధారాలు లేకుండా మాట్లాడడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. ఈటల వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, సల్ల వేంకటేశ, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






