- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో కానిస్టేబుల్ కి 30 ఏళ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో కానిస్టేబుల్ కి 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, తిరుమలగిరి : పోక్సో కేసులో కానిస్టేబుల్ కి 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోక్సో స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జి.ఉదయ భాస్కర్ రావు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించారు. బోయిన్ పల్లి సీఐ తిరుపతి రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిక్ విలేజ్ కి చెందిన పీసీ నెంబర్ 3859 వరదరాజ్ సుదేశ్ అనే పోలీస్ కానిస్టేబుల్ పై ఐపీసీ సెక్షన్లు 376(2) (ఎఫ్), 376(3), 506, పోక్సో చట్టంలోని సెక్షన్ 4(2), 6, 5(ఎన్) కింద దోషిగా నేరం రుజువు అయింది. అత్యాచారం, పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 30సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 12వేల జరిమానా విధించింది.
అలాగే ప్రభుత్వం బాధిత బాలికకు 1లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నేరస్తునికి కోర్టు సరైన శిక్ష విధించిందని బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కేసును అప్పటి డీఎస్పీ సి అంజయ్య, ఇన్‌స్పెక్టర్ కె రవి కుమార్ లు దర్యాప్తు చేశారు. స్పెషల్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం రమాదేవి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె ప్రతాప్ రెడ్డి ప్రాసిక్యూషన్ చేపట్టారు. కోర్టు కానిస్టేబుల్ లు ఎం కళ్యాణ్ వడ్ల, జె సాయి కుమార్ సాక్షాదారాలు ప్రవేశపెట్టడంలో ఎంతో కృషి చేశారని బోయినపల్లి సీఐ తిరుపతి రాజు పేర్కొన్నారు.






