ప్రభుత్వ కార్యాలయాలకు కండ్లకోయలో స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి

by Ratna Kumari |

మ‌ల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని కండ్లకోయలోనీ సర్వే నెంబర్లు: 135, 136 లలో ప్రభుత్వ స్థలాన్ని గురువారం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు

ప్రభుత్వ కార్యాలయాలకు కండ్లకోయలో స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మ‌ల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని కండ్లకోయలోనీ సర్వే నెంబర్లు: 135, 136 లలో ప్రభుత్వ స్థలాన్ని గురువారం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. కోర్టు కాంప్లేక్స్, డిస్ట్రీక్ట్, సబ్ రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు కేటాయించడానికి 12 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇక్కడ కోర్టు కాంప్లేక్సుకు 5 ఎకరాలు, రిజిస్టరేషన్ ఆఫీసులకు 3 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు 4 ఎకరాలు కేటాయించడం జరిగిందని అందుకు స్థలాన్ని పరిశీలించిన‌ట్టు తెలిపారు. ల్యాండ్ డెవలప్మెంట్ కు త్వ‌ర‌లోనే టెండర్ పిలుస్తామన్నారు. ఈ పర్యటనలో కీసర ఆర్డిఓ రాజేష్ కుమార్, మేడ్చల్ ఎమ్మర్వో భూపాల్, మేడ్చల్ డిప్యూటి కమీషనర్ సుధాంష్‌ పాల్గొన్నారు.

Next Story