స‌ర్పంచ్ అక్రిడిటేష‌న్ కార్డు ర‌ద్దు

by Disha Web Desk 15 |
స‌ర్పంచ్ అక్రిడిటేష‌న్ కార్డు ర‌ద్దు
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : అక్రిడేషన్ లో జ‌రిగిన అవకతవకల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి అన‌ర్హులైన వారి అక్రిడిటేష‌న్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం మేడ్చ‌ల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ హరీష్ ను కలిసి వినతి పత్రం అంద‌జేశారు. జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ( యాదాద్రి జిల్లా వడాయిగూడెం సర్పంచ్ జి.మనీష్ కుమార్)కి మీడియా అక్రిడిడేషన్ పొందిన విషయాన్ని టీయూడబ్ల్యుజే నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. స్పందించిన జిల్లా క‌లెక్ట‌ర్ స‌ర్పంచ్‌కి సంబంధించి అక్రిడిటేష‌న్ కార్డును ర‌ద్దు చేయ‌డంతో పాటు కార్డు తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డీపీఆర్వో కిరణ్ కుమార్ కు సూచించారు. అనంత‌రం టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు మోతే వెంక‌ట్‌రెడ్డి, జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాల‌రాజు లు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నెల‌కొన్న జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌ను క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చినట్లు తెలిపారు. ఏళ్ళ త‌ర‌బ‌డిగా ఉన్న కాచివాని సింగారం గ్రామంలో జర్నలిస్టులకు ఇచ్చిన ప‌ట్టాల స‌మ‌స్యను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన క‌లెక్ట‌ర్ ఇప్ప‌టికే ఈ విష‌య‌మై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుంద‌ని చెప్పారని తెలిపారు. మంత్రి స‌బితాఇంద్రారెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌మ‌స్య త్వ‌ర‌లోనే ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు స్థ‌లాన్ని ప‌రిర‌క్షించాల‌ని యూనియ‌న్ జిల్లా కార్య‌ద‌ర్శి వెంక‌ట్రామిరెడ్డి క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇందుకు స్పందించిన ఆయ‌న వెంట‌నే ఘట్కేసర్ మండల తహసీల్దార్ కు ఫోన్ చేసి కాచివాని సింగారం జర్నలిస్టుల స్థలానికి కంచె వేసేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed