బడా బిల్డర్స్ బరితెగింపు.. అడ్డు తగులుతున్న అధికారులపై సీఎంవో ఆఫీస్ నుంచి ఒత్తిడి

by Chintha Aamani |

అధికార పార్టీ నాయకుని అండతో బడా నిర్మాణ సంస్థలు బరితెగిస్తున్నాయి.

బడా బిల్డర్స్ బరితెగింపు.. అడ్డు తగులుతున్న అధికారులపై సీఎంవో ఆఫీస్ నుంచి ఒత్తిడి
X

దిశ,దుండిగల్ : అధికార పార్టీ నాయకుని అండతో బడా నిర్మాణ సంస్థలు బరితెగిస్తున్నాయి. బౌరంపేట లో తాము నిర్మించబోయే వందకోట్ల ప్రాజెక్ట్స్ కోసం అడ్డు వచ్చిన వారిని తొక్కేస్తూ ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం పనులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బౌరంపేటలో వందకోట్ల తో నిర్మాణాలు చేపట్టనున్న జెఎన్ఎస్,రుద్రా నిర్మాణ సంస్థలకు హెచ్ఎండీఏ అనుమతుల కోసం 40 ఫీట్ రోడ్డు తప్పనిసరి అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. అనుకున్నదే తడవుగా అధికారులను మ్యాన్ చేస్తూ ప్రభుత్వ భూమిలో బండ్ల బాటను కాస్త 40 ఫీట్ రోడ్డుగా మలిచేందుకు శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయాలంటే మున్సిపల్ చట్టం ప్రకారం లోకల్ బాడీ అధికారులు రెవెన్యూ శాఖకు సర్వే రిపోర్ట్ కోసం లేఖ రాయాల్సి ఉంటుంది. లేఖ ఆధారంగా సర్వే నిర్వహించి మున్సిపల్ అధికారులకు స్కెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకుండానే స్కెచ్ మ్యాప్ ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు మున్సిపల్ అధికారులు లేక రాయడం రెవెన్యూ అధికారులు స్కెచ్ అవ్వడం జరిగిపోయాయి. అవినీతి అధికారుల అండతో ప్రభుత్వ భూమిలో రోడ్డు విస్తరణ పనులు అంటూ పలు పత్రికల్లో పతాక శీర్షికన వార్తా కథనాలు వెలువడడంతో చేసిందంతా చేసిన సంబంధిత అధికారులు ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులెత్తేశాయి. కింది స్థాయి అధికారులు చేతులు ఎత్తేయడంతో జేఎన్ఎస్,రుద్రా నిర్మాణ సంస్థలు జిల్లా అధికారులను మ్యానేజ్ చేస్తూ రోడ్డు విస్తరణ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎంవో స్థాయిలో పైరవీలు...

బౌరంపేట సర్వే నెంబర్ 166/3,సర్వే నెంబర్ 166/1 ప్రభుత్వ భూమి గుండా రోడ్డు ను నిర్మించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. సదరు నిర్మాణ సంస్థలు అక్రమంగా నిర్మించిన రోడ్డును సక్రమం చేసేందుకు పథకం వేశాయి. పబ్లిక్ యుటిలిటీ కోసం రోడ్డును నిర్మిస్తున్నామని రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించాలని నమ్మబలుకుతూ కలెక్టర్ కు లేఖ రాసి లేఖ ఆధారంగా సీఎంవో ఆఫీస్ లో పైరవీలు చేసినట్లు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పైరవీలు ఆధారంగానే యథేచ్ఛగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ నాయకుని అండ...

రోడ్డు నిర్మాణ పనులకు సీఎం కు సన్నిహితుడను అంటూ చెప్పుకునే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండగా ఉండటంతో నిర్మాణదారులు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయు. కింది స్థాయి అధికారులు చేతులు ఎత్తేయడంతో సదరు నాయకుడు జిల్లా అధికారులను మ్యానేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విచారణ చేపట్టాం : ఆర్డీఓ

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టినట్లు మల్కాజిగిరి ఆర్డీఓ శ్యాం ప్రకాష్ తెలిపాడు. విచారణ లో 19 గుంటలు కబ్జా అయినట్లు తేలిందని పూర్తి విచారణ చేపట్టి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Next Story