బీ అలర్డ్.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త

by Ratna Kumari |

పని కోసమని ప్రాధేయపడుతారు. ఇంట్లో పని వాళ్లుగా.. కారు డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులు ఇలా ఏదో ఒక పేరుతో పనిలో చేరుతారు.

బీ అలర్డ్.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త
X

దిశ, మేడ్చల్ బ్యూరో : పని కోసమని ప్రాధేయపడుతారు.ఇంట్లో పని వాళ్లుగా.. కారు డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులు ఇలా ఏదో ఒక పేరుతో పనిలో చేరుతారు. అనతికాలంలోనే ఇంటి యాజమానులకు నమ్మకస్తులుగా నటిస్తారు. నమ్మిన తర్వాత భారీ స్కెచ్ వేసి సినీ ఫక్కిలో దొంగతనాలు, హత్యలకు పాల్పడుతుంటారు. హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్ ఇటివల పాల్పడిన రెండు వరుస ఘటనలు నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశం కానీ దేశం నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చామని.. తమకు ఏదైనా పని ఇవ్వాలంటూ ఇండ్లలో పని మనుషులుగా చేరిన నేపాలీలు పక్కగా రెక్కి నిర్వహించి ..సరైన సమయం చూసి ఇటివల రిటైర్డ్ డీజీపీ భార్యను హతమార్చి భారీ సోత్తును దోసుకువెళ్లిన ఘటన మరువక ముందే ..తాజాగా ఓ రిటైర్డ్ ప్రొఫేసర్ తోపాటు తన భార్యను తాళ్లతో కట్టేసి నగలు,నగదు మొత్తం సర్దుకుని పరారయ్యారు.

వరుస ఘటనలతో హైరానా..?

జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ రోడ్ నెంబర్ 7 లో జీ ప్లస్ టూ ఇంట్లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ నెల 7న రాత్రి తనూజ(62)తో ఆమె గదిలో మాట్లాడాక కుమార్తె సునందరంజన్ రెండో అంతస్తుకు వెళ్లి నిద్రించారు. ఇదే అదనుగా భావించిన నేపాల్ కు చెందిన మనిమనిషి కల్పన అలియాస్ ధర్మ(30) మరో ఇద్దరితో కలిసి తనుజాను ఊపిరాడకుండా నోట్లో గుడ్డలు కుక్కి,కట్టేసి హత్య చేసి ఇంట్లోని విలువైన బంగారు అభరణాలు, నగదుతో పరారయ్యారు. కల్పన నేపాలీ గ్యాంగ్ స్కెచ్ లో భాగంగానే హైదరాబాద్ వచ్చి భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జవహర్ నగర్ లోని కౌకుర్ లో మరోసారి నేపాలి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఈ నెల 12న గల్ప్ ఎన్ క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీ మోహన్,డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కాళ్లు, చేతులను తాళ్లతో కట్టి, మత్తు మందు ఇచ్చి భారీ దోపిడికి పాల్పడ్డారు.కాగా నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు.ఇంటి యజమానులకు నమ్మకస్తులుగా నటించి, నేపాలీ మహిళ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటామని నమ్మించి, మరో ముగ్గురు నేపాలీలను రప్పించారు. ఇంట్లో పనిచేస్తున్న జంటతోపాటు మరో ఐదుగురు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు.

సాహు గ్యాంగ్ పనేనా..?

నగరంలో వరుస దోపిడీల వెనుక నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీలు, హత్య కుట్ర ఢిల్లీ జైలులో జరిగిందని, తనూజ హత్య కేసులో ప్రధాన నింధితురాలు కల్పన నేతృత్వంలో నేపాల్, ముంబై నేరగాళ్లు ఈ ఘూతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. భారత్ లో ఉంటున్న నేపాలీలను పావులుగా వాడుకోని సాహు గ్యాంగ్ భారీ చోరీలకు ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.నేపాల్ గ్యాంగ్ పక్క ప్లాన్ ప్రకారం సంపన్నులైన వృద్దుల వద్ద ఇండ్లలో పని మనుషులుగా చేరుతారు. వారి కొడుకులు, కుమార్తెలు ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారో తెలుసుకుంటారు. ఆ తర్వాత అదను చూసి వారిని తాళ్లతో కట్టేసి ఎక్కడ నగదు, నగలు దాచారో చెప్పాలని నేపాలీ ముఠా హింసిస్తోంది. ఆ తర్వాత ఘటన స్థలం నుంచి ఆటోలలో సమీప బస్టాండ్, రైల్వే స్టేషన్లకు చేరుకుని అక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్ లోని నేపాల్ సరిహద్దులు దాటుతున్నారు.

ఎవరిని నమ్మాలో..తెలియని పరిస్థితి..!

హైదరాబాద్ నగరంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఎవరినైనా నమ్మితే నట్టేట్ట ముంచేసి వెళ్తున్న సంఘటనలు ఇటివల రెండు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎదో ఒక పేరుతో పనిలో చేరి.. అదను చూసి.. దొంగతనాలు, దోపిడీలు చేస్తున్న ఘటనలు పెరిగిపోతుండటంతో నమ్మకమైన వారిని పనుల్లో తీసుకోవడం కష్టంగా మారింది. మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు,పక్క దేశాల నుంచి కూడా ఉపాధి కోసం వచ్చి.. ఇక్కడ ఇళ్లళ్లో నమ్మకంగా ఉన్నట్టే ఉండి.. సరైన సమయం కోసం వేచి చూసి భారీగా దోసుకుంటున్నారు.

Next Story