మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, దుండిగల్: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మున్సిపాలిటీ పరిధిలోని సాయి పూజ కాలానికి చెందిన కుడుకుంట్ల వీరపండు(34) ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్యా, భర్త మధ్య మనస్పర్థలు రావడంతో భార్య ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన వీరపండు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సీలింగ్ ఫ్యాన్ కు చున్నితో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. పక్కింట్లో ఉన్న అతని స్నేహితుడు సాగర్ ద్వారా సమాచారం అందుకున్న అతని తల్లి ఉమారాణి ఇంట్లోకి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించాడు. అతడిని కిందికి దింపి చూడగా అప్పటికే, మరణించినట్లు గమనించి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story