ఉప్ప‌ల్ లో విషాదం.. యువతి సుసైడ్

by velandi.Saikiran |

ఓ యువతి సుసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఉప్ప‌ల్ లో విషాదం.. యువతి సుసైడ్
X

దిశ, ఉప్పల్: ఓ యువతి సుసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే, ఉప్పల్ బీరప్ప గడ్డ ప్రాంతానికి చెందిన జంగా శిరీష (21) గత కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకుంటోంది. అయితే ఆ బాధ భ‌రించ‌లేక‌, శుక్రవారం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇట్టి విషయం మీద మృతురాలి తండ్రి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story