మరోసారి బయటపడిన గాజులరామారం జువైనల్ హోమ్ రక్షణ లోపం

by Disha Web Desk 23 |
మరోసారి బయటపడిన  గాజులరామారం జువైనల్ హోమ్ రక్షణ లోపం
X

దిశ, దుండిగల్: గాజులరామారం జువైనల్ హోమ్ రక్షణ లోపం మరోసారి బయటపడింది. గతంలో పలువురు బాలనేరస్థులు జువైనల్ హోమ్ నుంచి బయటకు పారిపోయిన సంఘటనలు జరిగినా దిద్దుబాటు చర్యల్లో అధికారులు విఫలమవుతున్నారు. గాజులరామారం జువైనల్ హోమ్ లో పలు నేరాల కింద శిక్షను అనుభవిస్తున్న బాలనేరస్థులు 32 మంది వరకు ఉన్నారు. మంగళవారం హోమ్ నుండి 8 మంది కిటికీ గ్రిల్ తొలగించి పరారయ్యారు. గతంలో కూడా ఈ సధనం నుండి బాలనేరస్థులు పరారైన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. భద్రతా లోపం,అధికారుల నిఘా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.

అనేక నేరాల్లో శిక్షణను అనుభవిస్తున్న బాలనేరస్థులు పరారై ఇతర నేరాలకు పాల్పడితే బాధ్యులు ఎవరు అనే సందేహం వినిపిస్తుంది,కంటికి రెప్పలా కాపాడుతూ వారికి విద్యతోపాటు మంచి బుద్ధులు నేర్పాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సదనంలోని బాలురు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పారిపోయిన సంఘటనలతో అధికారుల విచారణ లోపం కారణంగానే సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం. వరుస సంఘటనలు జరుగుతున్న సూపరెండెంట్ సంగమేశ్వర్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం కారణంగా సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.ముగ్గురు సూపర్వజర్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

సూరారం పీఎస్ లో ఫిర్యాదు..

గాజులరామారం జువైనల్ హోమ్ లో జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపరెండెంట్ సంగమేశ్వర్ సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చార్మినార్ కు చెందిన మైరాజ్@మెహరాజ్,సంతోష్ నగర్ కు చెందిన షేక్ రెహాన్, చంద్రాయనిగుట్టకు చెందిన సయ్యద్ అజం,చంద్రాయన గుట్ట కు చెందిన సయ్యద్ సోహైల్,గోపాలపురం కు చెందిన షేక్ అబ్దుల్ హాక్,గోల్కొండకు చెందిన మహమ్మద్ రెహాన్,డబీర్ పూరకు చెందిన మహమ్మద్ హకీమ్,చార్మినార్ కు చెందిన మహమ్మద్ మహబూబ్ పరారయినట్లు సమాచారం. వీరిలో 5 గురు 18 సంవత్సరాల పైబడిన వారు కాగా,ముగ్గురు మాత్రమే 18 సంవత్సరాల లోపు వయసు వారు ఉండడం విశేషం. మంగళవారం ఉదయం 11.45 నిమిషాలకు పరారయినట్లు పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకున్న సూరారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ వెంకటేశం తెలిపారు.

Next Story

Most Viewed