క్షమాపణలు చెప్పండి లేదా తప్పుని ఒప్పుకోండి.. అమిత్ షాపై మమతా బెనర్జీ కామెంట్స్

by Dishanational6 |
క్షమాపణలు చెప్పండి లేదా తప్పుని ఒప్పుకోండి.. అమిత్ షాపై మమతా బెనర్జీ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: హోంమంత్రి అమిత్ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రాజెక్టులకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ లను సమర్పించడం లేదని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. అబద్ధం చెప్తున్నారని అంగీకరించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బెంగాల్ లోని మేమరిలో సోమవారం అమిత్ షా ప్రసంగించారు. బెంగాల్ ప్రభుత్వం రూ.2.32 లక్షలకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు మమతా బెనర్జీ. టీఎంసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికేట్‌లు పెండింగ్‌లో లేవని సవాల్ చేశారు.

కేంద్ర ప్రభుత్వంలోని 32 శాఖలు ఇంకా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉందని కాగ్ నివేదికలో పేర్కొన్నట్లు మమతా బెనర్సీ తెలిపారు. రూ. 52 వేల కోట్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని కాగ్ రిపోర్టు పేర్కొందని.. ముందుగా మీరే చూడలని మండిపడ్డారు.

సీఏఏ అమలు చేయవద్దంటే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను కోరారు మమతా బెనర్జీ. మూడోసారి అధికారంలో వస్తే.. బీజేపీ ఎవరినీ వదిలిపెట్టదన్నారు. ఎస్టీలు, ఆదివాసీల, మైనారిటీలతో సహా హిందువులు, ముస్లింలను ఎవరినీ విడిచిపెట్టరని అన్నారు. అందర్నీ తరిమి కొడతారని పేర్కొన్నారు.

హిందూ మతానికి గురువులమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు... స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. అప్పటికి ఇంకా బీజేపీని ఏర్పాటు చేయలేదని అన్నారు. దుర్గాదేవి, లక్ష్మీదేవిని పూజించవద్దని.. వారు హిందూ మతాన్ని బోధిస్తున్నారని అన్నారు.

గ్యాస్ ధరలు, మెడిసిన్ ధరల పెంపు విషయంలో బీజేపీపై టీఎంసీ చీఫ్‌ మండిపడ్డారు. 2016 టీచర్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ నియామకాలు చెల్లవని కలకత్తా హైకోర్టు ఇటీవల ప్రకటించిన తర్వాత బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. కానీ తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు.

మాల్డా ఉత్తర్‌లో మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 22 సీట్లుగెలుచుకోగా, బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది.

Next Story

Most Viewed