అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఎదురు దెబ్బ..!

by Dishanational6 |
అమెరికా మాజీ అధ్యక్షుడికి మరో ఎదురు దెబ్బ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని భారీగా జరిమానా విధించింది కోర్టు. న్యూయార్క్ హుష్ మనీ కేసుకు సంబంధించి సాక్షులు, న్యాయమూర్తులు సహా కొందరిపై బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించే గ్యాగ్ ఆర్డర్ ను ఉల్లంఘించారు ట్రంప్. గ్యాగ్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించడంతో కోర్టు.. ట్రంప్ నకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది.

ట్రంప్ పది సార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రాసిక్యూటర్లు. అయితే న్యూయార్క్ కోర్టు జడ్జి మాత్రం 9సార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. అయినప్పటికీ. తన వాక్ స్వాతంత్ర హక్కులను వాడుకోవాలని పట్టుబట్టారు ట్రంప్.

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రభఆవితం చేసేందుకు ట్రంప్, అతని అనుచరులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కానీ, ట్రంప్ మాత్రం తాను నిర్దోషి అని అన్నారు. ఈకేసులో విచారణకు తొలిసారిగా అతని కుమారుడు ఎరిక్ తో పాటు ట్రంప్ కోర్టుకు హాజరయ్యారు. నేరవిచారణకు తొలిసారిగా కుటుంబసభ్యుడితో హాజరయ్యారు ట్రంప్.

2006లో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం బయటపడకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు 1,30,000 డాలర్లను చెల్లించారని ఆయనపై అభియోగాలు వచ్చాయి. ఆ చెల్లింపును దాచిపెట్టేందుకు బిజినెస్ రికార్డులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అయితే స్టార్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం లేదని అన్నారు డోనాల్డ్ ట్రంప్. ఈ కేసులో ఏప్రిల్ 22 నేర విచారణ ప్రారంభమైంది.

ఇకపోతే, సుమారు రెండు డజన్ల మంది ట్రంప్ మద్దతుదారులు కోర్టు బయట ర్యాలీ చేశారు. "TRUMP 24" అని రాసి ఉన్న బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. కొంతమంది వ్యక్తులు విచారణను నిరసిస్తున్నారని ట్రంప్ ఫిర్యాదు చేయడంతో స్థానిక రిపబ్లికన్ సంస్థ మద్దతుదారులకు పిలుపునిచ్చింది. బ్యాంగర్ గ్యారీ ఫారో ట్రంప్ ఆర్థిక రికార్డుల గురించి వాంగ్మూలం ఇచ్చారు. అదే ఈ కేసు విచారణకు సహాయపడిందన్నారు ప్రాసిక్యూటర్లు.

Next Story

Most Viewed