- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన యంగ్ స్టార్ ఫౌండేషన్
by Ratna Kumari |
దిశ, మెదక్ టౌన్ : హవేలీ ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో లో ప్రమాదవశాత్తు చాపల కిష్టయ్య పూరి

X
దిశ, మెదక్ టౌన్ : హవేలీ ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో లో ప్రమాదవశాత్తు చాపల కిష్టయ్య పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకుని యంగ్ స్టార్ ఫౌండేషన్ సభ్యులు రాగి వనజ అశోక్, రాణి, సంతోష్ గౌరీ, మౌనిక, సుమన లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు, బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ స్టార్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ మీరు ఆధైర్య పడకుండా క్షేమంగా ఉండాలని, కుటుంబాన్ని ఓదార్చి మీకు అండగా మేముంటామని వారికి మనోధైర్యాన్నిచ్చి సంతోషంగా ఉండాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జక్కన్నపేట సర్పంచ్ చామంతుల సత్యనారాయణ, ఉప సర్పంచ్ కనకమ్మ ముత్యంరాజ్, తేజిందర్ సింగ్, చామంతుల రాజు పాల్గొన్నారు.
Next Story






