ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ముందు కార్మికుల ఆందోళన

by Ratna Kumari |

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ)లోని ట్రైడెంట్ చక్కెర కర్మకారం ముందు కార్మికులు మరోసారి ఆందోళన చేపట్టారు. బకాయిల చెల్లింపును డిమాండ్ చేశారు.

ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ముందు కార్మికుల ఆందోళన
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ)లోని ట్రైడెంట్ చక్కెర కర్మకారం ముందు కార్మికులు మరోసారి ఆందోళన చేపట్టారు. బకాయిల చెల్లింపును డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు యాజమాన్యాలు మారుతున్నప్పటికీ కార్మికులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదని ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షులు ఎంజీ. రాములు ఆరోపించారు. పరిస్థితిలో మార్పు రాకుంటే పనులు స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ట్రేడింగ్ కర్మకారంలో ఓంకార్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం యూపీ, బీహార్ రాష్ర్టాల నుంచి 300కు పైగా వలస కార్మికులతో పనులు చేయిస్తుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు కర్మగారం ముందు ఆందోళన చేపట్టారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు రాములన్న మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ కంపెనీ యాజమాన్యం తోపాటు జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి స్థానిక సమస్యలు తీసుకొని పోనున్నట్లు చెప్పారు.

బ‌కాయిలు చెల్లించాల‌ని డిమాండ్..


ట్రేడ్ షుగర్స్ లిమిటెడ్ ఉద్యోగులు అందడం చేపట్టారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు రావలసిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా కర్మాగారం కొనుగోలు చేసిన యాజమాన్యం పరిశ్రమలో ప్రత్యేకంగా వలస కార్మికులను నియమించుకొని పనులు చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆరోపించారు. పలుమార్లు ఈ విషయమై ఓంకార్ షుగర్స్ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించిన ఎలాంటి స్పందన లేదన్నారు. తమకు కర్మగారం బకాయిపడిన పీఎఫ్ డబ్బులతో పాటు 11 నెలల వేతనాలు, గ్రాడ్యుటి హెచ్ఆర్ఏ ఇతర జీతభత్యాలను కర్మగారం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలియకుండా యూపీ, బీహార్ కు చెందిన 300 మందికి పైగా వలస కార్మికులతో కొత్త యాజమాన్యం పనులు చేస్తుందని పేర్కొన్నారు. ఎన్సీఎల్టీ కోర్టు నుంచి డెల్టా సోర్స్ యజమాని ఎండీ ఉమర్ కొనుగోలు చేసి, తమ మూడవ పార్టీ అయినా ఒంకార్ షుగర్స్ లిమిటెడ్ వారు కొనుగోలు చేసారు. యాజమాన్యాలు మారినప్పటికీ తమకు రావలసిన బకాయిలు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. కానీ ఫ్యాక్టరీలో అడ్డగోలుగా కటింగ్ పనులు చేస్తూ మా హక్కులకు భంగం కలగజేస్తున్నారని ఆరోపించారు. ఓంకార్ షుగర్ కు చెందిన కొందరు అధికారులు ఇక్కడున్నారని , వారిని సంప్రదించినా సరైన సమాధానం రాలేదన్నారు. తమకు తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పనులు స్తంభింప చేస్తామని హెచ్చరించారు. కంపెనీ కార్మికులు కలెక్టర్ తో పాటు ఇతర అధికారులకు ఈ లేఖలు సమ‌ర్పించారు.

Next Story