తూంకుంట తనయకు డీసీసీ పీఠం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తూంకుంట ఆంక్ష రెడ్డి నియమితులయింది. తూకుంట నర్సారెడ్డి తనయగా రాజకీయ అరంగేట్రం చేసిన తూంకుంట ఆంక్ష రెడ్డి

తూంకుంట తనయకు డీసీసీ పీఠం..!
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తూంకుంట ఆంక్ష రెడ్డి నియమితులయింది. తూకుంట నర్సారెడ్డి తనయగా రాజకీయ అరంగేట్రం చేసిన తూంకుంట ఆంక్ష రెడ్డి ఎన్ ఎస్ యూఐ, యువజన కాంగ్రెస్ లో పని చేశారు. తండ్రికి అండగా రాజకీయంలో అడుగు పెట్టిన ఆంక్ష రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఆంక్షరెడ్డి గెలుపొందింది. జిల్లాలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగిన ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ హస్తం పార్టీ అధిష్టానం మన్ననలు పొందింది. సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం హేమాహేమీ లు పోటీ పడినప్పటికీ హస్తం పార్టీ అధిష్టానం మాత్రం యువతకు ప్రాధాన్యత ఇస్తూ తూంకుంట ఆంక్ష రెడ్డి వైపే మొగ్గు చూపింది. అందరి అంచనాలను తలక్రిందులుగా చేస్తూ అధిష్టానం అంక్ష రెడ్డిని డీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించడంతో అతిపిన్న వయస్సులో డీసీసీ పీఠం అధిష్టించిన నేత గా రికార్డును కైవసం చేసుకుంది. జిల్లా ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి మహిళ నేతకు డీసీసీ పదవి దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story