ఎర్దనూర్ లో దొంగల హల్చల్...కర్రలు పట్టుకుని అర్ధరాత్రి

by velandi.Saikiran |

ఎర్దనూర్ లో దొంగల హల్చల్ చేసారు. మొత్తం ఐదు మంది దొంగలు కర్రలు పట్టుకుని అర్ధరాత్రి దాటక గ్రామంలోకి వచ్చారు.

ఎర్దనూర్ లో దొంగల హల్చల్...కర్రలు పట్టుకుని అర్ధరాత్రి
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఎర్దనూర్ లో దొంగల హల్చల్ చేసారు. మొత్తం ఐదు మంది దొంగలు కర్రలు పట్టుకుని అర్ధరాత్రి దాటక గ్రామంలోకి వచ్చారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఓ బైకును ఎత్తుకు వెళ్లారు. మరో గ్రామంలో కూడా ఈ ముఠా చోరీకి విఫల యత్నం చేశారు. సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం ఎర్దనూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఐదు మంది దొంగలు ముఠా సభ్యులు గ్రామంలో చొరబడ్డారు. గ్రామంలోని కమ్మరి గురుమూర్తికి చెందిన బైకును దొంగలు ఎత్తుకు వెళ్లారు. ఈ దృశ్యాలు గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదే రోజు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో కూడా ఈ ముఠా సభ్యులు చోరీకి విఫల యత్నం చేశారు. గ్రామంలో ఒకేసారి ఇలా దొంగల ముఠా సభ్యులు చోరీకి పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story