కల్వర్టును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2023-04-11 09:19:51  IST  )

ప్రమాదవశాత్తు కల్వర్టును కార్ ఢీకొట్టగా.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొండపాక గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది.

కల్వర్టును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
X

దిశ, కొండపాక: ప్రమాదవశాత్తు కల్వర్టును కార్ ఢీకొట్టగా.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొండపాక గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి లోని శిల్ప బృందవనం కాలనీకి చెందిన నుతక్కి నిఖిల్ కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు రోజుల క్రితం నగరంలోని తన ఇంటికి రాగా, తిరిగి కరీంనగర్ కు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ శివారు లో గాయత్రీ దేవి ఆలయం వద్ద నిఖిల్ నిద్రమత్తులో ప్రమాదవశాత్తు కారును కల్వర్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నిఖిల్ అక్కడిక్కడే మృతి చెందాడు.

Next Story