సమయపాలన పాటించని వైద్య సిబ్బంది..

by Disha Web Desk 20 |
సమయపాలన పాటించని వైద్య సిబ్బంది..
X

దిశ, రాయపోల్ : రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంతో సిబ్బంది కంటే ముందు వివిధ పరీక్షల కోసం ఆసుపత్రి వద్ద గంట తరబడి వైద్య సిబ్బంది కోసం ఎదురు చూడాల్సిన అవసరం వచ్చిందని గత మూడురోజుల నుంచి వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు నాన్న ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు పరచడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్గరుస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బాధను చెప్పుకున్నారు. ఇదే సమయంలో పల్లె ప్రగతి పండుగ సందర్భంగా గ్రామసర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న పల్లె ప్రకృతి వనం సందర్శించారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దరోగులు పడిగాపులు కాస్తున్న విషయాన్ని గమనించిన సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ఆసుపత్రిలోకి వెళ్లి పరిశీలించగా డాక్టర్ తో పాటు సిబ్బంది మొత్తం గజహాజ, మరికొంతమంది సమయపాలన పాటించకపోవడంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన సిబ్బంది ఉదయం 11 గంటల వరకు కూడా రాకపోవడం పై మండిపడ్డారు. ఆసుపత్రి ఫార్మసిస్టు కూడా సమయపాలన పాటించకపోవడంతో రోగులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామసర్పంచ్ మౌనిక రాజిరెడ్డి జిల్లా వైద్యాధికారితో మాట్లాడు సిబ్బంది పనితీరు మార్చుకొని రోగులకు సేవలు అందించాలని ఆయన డీఎంహెచ్ఓ కాశీనాథ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే సిబ్బంది పనితీరు మెరుపరచుకోవాలని తాము ఆదేశాలు ఇస్తామని నిర్లక్ష్యంగా వివరించే వారి పై కఠించిన తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed