- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోతారు మొత్తం పోతారు.. సంగారెడ్డి జిల్లాపై చలి పంజా..!
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి వణికిస్తోంది. రాష్ట్రంలోనే మంగళవారం జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి వణికిస్తోంది. గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నప్పటికీ, చలి మాత్రం కూల్ కూల్ చేస్తోంది. దీంతో ఓటర్లు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోనే మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ పట్టణంలో రాష్ట్రంలోనే అతి తక్కువైన 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక న్యాల్ కల్ 7.5 డిగ్రీలు, ఝరాసంగం-మొగుడంపల్లి ప్రాంతాల్లో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి ప్రభావంతో ఓటర్లు, ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్పంచ్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలి తీవ్రంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు..
జహీరాబాద్ 8.2°, నిజాంపేట్ 8.6°, గుమ్మడిదల 8.7°, సిర్గాపూర్ (కడపల్) 9.0°, కోహిర్ (దిగ్వాల్) 9.1°, జహీరాబాద్ పట్టణం 9.2°, పూల్‌కల్ 9.4°, జిన్నారం, సిర్గాపూర్, కంగ్టి ప్రాంతాల్లో 9.6°, రాయికోడ్‌లో 9.8° కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగలిగిద్ద, నారాయణఖేడ్, హత్నూర్, కంది, చౌటకూర్, మనూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా 10.2° పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ పట్టణంలో 6.6° కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్‌చెరులో 14.6° కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.






