అదిగో పులి.. భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు

by Disha Web Desk 1 |
అదిగో పులి.. భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు
X

దిశ, ఝరాసంగం: ఎప్పుడూ లేని విధంగా సంగారెడ్డి జిల్లాలో పులి సంచరిస్తున్న పుకార్లు వినిపిస్తున్నాయి. గత రాత్రి ఝరాసంగం మండలంలోని బోరేగావ్ గ్రామానికి చెందిన ఓ రైతు 2:30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లి వస్తుండగా తనకు పులి కనిపించిందని గ్రామస్థులు చెప్పడంతో విషయం మండల వ్యాప్తంగా దావనంలో వ్యాపించింది. గ్రామస్థులు ఝరాసంగం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకున్నారు.

రాత్రంతా గ్రామంలో గస్తీ నిర్వహించారు. ఇదే విషయంపై ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డిని దిశ వివరణ కోరగా గ్రామస్థులు ఫోన్ చేసిన వెంటనే గ్రామానికి వెళ్లామని అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని గ్రామస్థులు భయాందోళన గురికావాల్సిన అవసరం లేదన్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు.

పులి ఆనవాళ్లు కనిపించలేదు: అటవీ శాఖ అధికారులు

ఝరాసంగం మండలంలోని బోరేగావ్ గ్రామంలో పులి సంచరించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాత్రంతా పోలీసులు గస్తీ నిర్వహించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందియడంతో అటవీ శాఖ అధికారులు శనివారం మధ్యాహ్నం గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. పులి ఆనవాళ్లు లేవని ఏదో ఒక అడవి జంతువు అయి ఉంటుందని అంచనా వేశారు. చుట్టూ ఎటు చూసినా అడవి ప్రాంతం లేదని అలాంటప్పుడు పులి ఎలా సంచరిస్తుందని ప్రశ్నించారు. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Next Story

Most Viewed