తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య: కలెక్టర్ రాజర్షి షా

by Disha Web Desk 1 |
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య: కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, మెదక్ ప్రతినిధి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమర వీరుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దొడ్డి కొమరయ్య 96వ జయంతి సోమవారం కలెక్టరేట్ లో బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, వివిధ సంఘాల నాయకులతో కలిసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే సమాజ హితం కోసం పోరాటం చేసిన యోధుడు కొమురయ్య అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభానికి నాంది కొమురయ్య చేసిన ఉద్యమమేనని పేర్కొన్నారు. జమిందారీ, భూస్వామ్య వ్యవస్థపై ప్రజలలో చైతన్యం రగిలించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటమే ఉద్యమంగా మారిందని ఆయన తెలిపారు.

ఒక ఆదర్శ మూర్తిగా ఆయన స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నారని తెలిపారు. ఆ మహానీయుడి జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకుని వారి ఆశలు, ఆశయాలకు కృషి చేసేలా ప్రభుత్వం పాఠ్యంశంగా పెటిందన్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ హక్కులను కాలరాస్తున్న భూస్వాములు, పెత్తందార్ల ఆగడాలను అరికట్టి బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉద్యమాలు చేసిన యోధుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి కేశూరం, సహాయ బీసీ అభివృద్ధి అధికారి నాగరాజు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు గండి మల్లేశం, ప్రధాన కార్యదర్శి చోలా రామచంద్రం, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మీరు గంగారాం, జిల్లా యువజన అధ్యక్షుడు పలువంచ శేఖర్, బీసీ కార్యాలయ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed