Crime News :పాఠశాల తాళం పగులగొట్టి చోరీ

by S Gopi |   (  Updated:2022-09-22 12:07:02  IST  )

మండల పరిధిలోని గజవాడ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం....Table, Tube Lights stolen from school

Crime News  :పాఠశాల తాళం పగులగొట్టి చోరీ
X

దిశ, రేగోడ్: మండల పరిధిలోని గజవాడ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పాఠశాల తెరిచే సమయానికి తాళాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని గుర్తించి రేగోడ్ ఎస్సై సత్యనారాయణకు ప్రధానోపాధ్యాయురాలు దీప్తిప్రసన్న సమాచారం అందించారు. చోరీపై విచారణ జరపగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లను దొంగలు అపహరించుకుపోయారని గుర్తించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Next Story