గుడ్డు రేటు డమాల్...అస‌లు కార‌ణం ఇదే

by velandi.Saikiran |

పౌల్రీ పరిశ్రమకు కమర్షియల్ కింద యూనిట్ ధర 6.50 పడుతుంది. 50 నుంచి 60 శాతం సబ్సిడీ పై విద్యుత్ ను పౌల్ట్రీ రైతులకు అందించాలి.

గుడ్డు రేటు డమాల్...అస‌లు కార‌ణం ఇదే
X

గుడ్డు రేటు డమాల్

l గత ఏడాది డిసెంబర్లో

గుడ్డు హోల్ సేల్ లో ధర రూ.6

l ప్రస్తుతం రూ.3.50, ఒక్క గుడ్డుకు రైతుకు రూ.5 ఖర్చు

l తగ్గిన ధరతో రైతుకు రూ.2.50 నష్టం

l పెరిగిన దానా ఖర్చు

l యుద్ధ ప్రభావం, మండు టెండలతో పౌల్ట్రీ రైతు విలవిల

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మండు టెండలు.. పెరిగిన దానా ఖర్చుకు తోడు ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ద ప్రభావంతో పౌల్ట్రీ రైతులు విలవిలలాడుతున్నారు. గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచి పోయి దేశీయంగా ధరలు భారీగా పతనం అవడంతో పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గత సంవత్సరం మార్చి నెలలో ఒక్క గుడ్డు ధర బహిరంగ మార్కెట్ లో హోల్ సేల్ లో రూ.6 పలుకగా ప్రస్తుతం రూ.3.50 పైసలు పలుకుతుంది. ఒక్క గుడ్డు ఉత్పత్తి కోసం రైతుకు రూ. 5 ఖర్చు అవుతుండగా ధర తగ్గింపుతో ఒక్క గుడ్డుపై పౌల్ట్రీ రైతులు రూ.2.50 నష్టం చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సుమారు 35 నుంచి 40 లేయర్ పౌల్ట్రీ ఫాంల్లో సుమారు 50 లక్షల వరకు లేయర్ కోళ్లకు పెంచుతున్నారు. లేయర్ ఫాంల్లో ఒక్క కోడి పెంచడానికి రైతుకు రోజుకు రూ.5 ఖర్చు అవుతుంది. కోడికి వచ్చే వ్యాధుల ఖర్చులు అదనం. దానాగా ఇచ్చే సోయా ధర కిలో రూ.38 ఉన్న ధర గత కొన్ని రోజులుగా కిలోకి రూ. 43 (8.5శాతం) పెరిగింది. దీంతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఉదాహరణకు 5 వేల లేయర్ పొల్టీ ఫౌంలో రోజుకు 4 వేల నుంచి 4500 వరకు గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. రోజుకు ఒక్క కోడికి రూ.5 చొప్పున మొత్తం 5వేల కోళ్లకు రూ.25వేల ఖర్చు అవుతుందని అంచనా కాగా తగ్గిన ధరతో రూ.18వేల ఆదాయం వస్తుంది. దీంతో ప్రతి రోజు పౌల్ట్రీ రైతు రూ.7 వేల నష్టం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు యుద్ద ప్రభావంతో దేశీయ గుడ్ల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేక పోవడంతో గుడ్ల ధరలు మరింత పతనం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పేపర్ రేట్ తో పోలిస్తే..

పేపర్ రేట్ తో పోలిస్తే పౌల్ట్రీ రైతులకు దక్కేది మరింత తక్కువ గానే ఉంటుంది. ఉదాహరణ కు పేపర్ ధర రూ.4.20 ఉంటే ట్రేడర్స్ రైతుకు చెల్లించేదీ రూ. 3.50 పైసలు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన పెరిగిన దానా ఖర్చులు, తగ్గిన గుడ్డు ధరతో ఫౌల్ట్రీ రైతులు మరింత నష్టాల పాలు అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎండల తీవ్రతో తగ్గిన గుడ్ల ఉత్పత్తి..

ఎండల తీవ్రత గుడ్ల ఉత్పత్తిపై ప్రభావం ఉంటుంది. పెరిగిన ధానా ఖర్చులకు తోడు ఎండల తీవ్రతో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో పాటుగా గుడ్డు ధర తగ్గడం ఫౌల్రీ రైతులు తీవ్రంగా నష్టం పోయ్యే పరిస్థితులు నెలకున్నాయి.

విద్యుత్ పై సబ్సిడీ ఇవ్వాలి..

పౌల్రీ రైతు డా. బాల సుంధరం

పౌల్రీ పరిశ్రమకు కమర్షియల్ కింద యూనిట్ ధర 6.50 పడుతుంది. 50 నుంచి 60 శాతం సబ్సిడీ పై విద్యుత్ ను పౌల్ట్రీ రైతులకు అందించాలి. రైతులు పండించే ప్రతి పంట, ఉప ఉత్పత్తులను సైతం పౌల్ట్రీ కి ఉపయోగించుకొని రైతులకు పౌల్ట్రీ రైతులు అండగా నిలుస్తున్న నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీ పై అందించాలి. బ్యాంకుల రుణాలు రూ.50 పైసల వడ్డీ పై అందించి పౌల్రీ రైతులను ఆదుకోవాలి.

Next Story