బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిక

by Ratna Kumari |

దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట అర్బన్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తడ్కపల్లి గ్రామానికి చెందిన అంబటి మహేష్ గౌడ్, నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సిద్దిపేట

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిక
X

దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట అర్బన్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తడ్కపల్లి గ్రామానికి చెందిన అంబటి మహేష్ గౌడ్, నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో హస్తం తీర్థం పుచ్చుకున్న నాయకులకు పార్టీ నియోజక వర్గ ఇన్ చార్జి పూజల హరికృష్ణ పార్టీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ఇన్ చార్జి మాట్లాడుతూ.. సిద్దిపేట లో హరీశ్ రావు పతనం స్టార్ట్ అయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామ‌ని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి బిక్షపతి, నాయకులు బొమ్మల యాదగిరి, దాస అంజన్న, ముద్దం లక్ష్మీ పాల్గొన్నారు.

Next Story