మాసాయిపేటలో దొంగల బీభత్సం

by Bhanu |   (  Updated:2025-12-06 14:47:08  IST  )

మాసాయిపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు దుకాణాల తలుపులు తొలగించి విలువైన సామాగ్రి, నగదును ఎత్తుకెళ్లారు.

మాసాయిపేటలో దొంగల బీభత్సం
X

దిశ, వెల్దుర్తి: మాసాయిపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు దుకాణాల తలుపులు తొలగించి విలువైన సామాగ్రి, నగదును ఎత్తుకెళ్లారు. రెండు కిరాణా జనరల్ స్టోర్లతో పాటు, ఆగ్రోస్ రైతు వేదిక దుకాణం బద్దలు కొట్టి దాదాపు రూ. 20 వేల నగదును దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story