నిధులు విడుద‌ల చేయాల‌ని క‌లెక్ట‌ర్ కి స‌ర్పంచ్ ల విన‌తి

by Ratna Kumari |

గ్రామపంచాయతీకి సంబంధించి 15 వ ఫైనాన్స్ నిధుల విడుదల గురించి మంగళవారం సర్పంచ్ లు మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.

నిధులు విడుద‌ల చేయాల‌ని క‌లెక్ట‌ర్ కి స‌ర్పంచ్ ల విన‌తి
X

దిశ‌, నిజాంపేట : గ్రామపంచాయతీకి సంబంధించి 15 వ ఫైనాన్స్ నిధుల విడుదల గురించి మంగళవారం సర్పంచ్ లు మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. నిజాంపేట మండలనికి చెందిన 13 మంది సర్పంచులు కలెక్టర్, డీపీఓ కు నిధుల విడుదల గురించి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీకి సంబంధించి పీఎఫ్ఎంఎస్ అకౌంట్లో, కేంద్ర ప్రభుత్వ నిధులు జమ చేసినప్పటికీ దానిని గ్రామ మౌలిక సదుపాయాల కొరకు వాడుకోలేకపోతున్నామని, దీనికి సంబంధించిన నిబంధనల గురించి ఏ ఒక్క సెక్రటరీగాని, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బందికి గాని అవగాహన లేకపోవడం వల్ల నిధులు నిరుపయోగంగా అకౌంట్ లో ఉన్నాయన్నారు. అధికారుల జాప్యం వల్ల నిధులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. గత సర్పంచులు పని చేసి దానికి సంబంధించిన ఎం.బి లు రికార్డు చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారికి నిధులు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో.. కలెక్టర్, డీపీఓ స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. మండల ఫోరం అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.

Next Story