- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి జిల్లాలో జోరుగా సర్పంచ్ నామినేషన్లు
మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం జోరు అందుకుంది.

దిశ, సంగారెడ్డి బ్యూరో : మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం జోరు అందుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నామినేషన్ల వేయడానికి ఆశావాహులు మద్దతు దారులతో కలిసి రావడంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మొదటి విడత సంగారెడ్డి జిల్లాలో 136 సర్పంచ్ స్థానాలకు గాను రెండో రోజు 191 నామినేషన్ల దాఖలు కాగా మొత్తం 305 నామినేషన్ల దాఖలయ్యాయి. 1246 వార్డు మెంబర్ స్థానాలకు రెండో రోజు 760 నామినేషన్ల దాఖలు కాగా మొత్తం 912 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
సిద్దిపేట జిల్లాలో 163 సర్పంచ్ స్థానాలకు రెండో రోజు 194 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం 325 నామినేషన్లు దాఖలయ్యాయి. 1432 వార్డులకు మెంబర్ స్థానాలకు రెండో రోజు 445 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం 520 నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ జిల్లాలో 160 సర్పంచ్ స్థానాలకు రెండో రోజు 152 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం 207 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు మెంబర్లకు మొత్తం 397 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది.






