టార్గెట్ వంద శాతం..!

by Ratna Kumari |

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ నూరు శాతం లక్ష్యంగా పని చేయాలని హెల్త్,

టార్గెట్ వంద శాతం..!
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ నూరు శాతం లక్ష్యంగా పని చేయాలని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీతా సత్యనారాయణ అన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్‌లతో కలిసి జిల్లా మెడికల్ & హెల్త్ అధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌లో ఎమ్‌సీహెచ్, ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు, ఎన్‌సీడీలు, టీబీ కంట్రోల్, తెలంగాణ డయాగ్నాస్టిక్స్, ఎస్‌ఎన్‌సీయూలు, రెఫరల్ కేసులు కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష జరిగింది. ప్రతి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు వంద శాతం టార్గెట్‌లు సాధించాలని కమిషనర్ ఆదేశించారు. లేకపోతే డిపార్ట్‌మెంటల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు పీహెచ్‌సీలకు రెగ్యులర్‌గా వెళ్లి మానిటరింగ్ చేయాలని, పబ్లిక్ హెల్త్ సేవలు అందరికీ అందేలా చూడాలని సూచించారు. ఎమ్‌సీహెచ్, హెమిస్ పోర్టల్‌లలో త్వరగా, సరైన ఎంట్రీలు తప్పనిసరి. మీటింగ్‌లో డీఎమ్‌హెఓ డాక్టర్ ఎం. వసంత రావు, అదనపు డీఎమ్‌హెఓలు డాక్టర్లు సునంద, శైలజ, శ్రీనివాస రావు, డీటీసీఓ డాక్టర్ అరుణ్ కుమారి, పీఓడీటీటీ డాక్టర్ శశాంక్, మలేరియా ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్‌సీడీ-ఎయిడ్స్-లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ దీప్తి పాల్గొన్నారు.

Next Story