- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరాంజనేయుడి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: మంత్రి హరీష్ రావు
by Kema Shiva Kumar |
వీరాంజనేయుడి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆకాంక్షించారు.

X
దిశ, సదాశివపేట: వీరాంజనేయుడి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆకాంక్షించారు. హనుమాన్ మందిరంలో హనుమాన్ జన్మదినం వేడుకల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ మార్గంలోనే మనశ్శాంతి లభిస్తుందని, వీరాంజనేయుడి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, పులిమామిడి రాజు, చౌదరి ప్రకాష్, రవికుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చీల మల్లన్న, పిల్లిగుండ్ల వీరేశం, కోడూరు అంజయ్య, తదితర పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






