- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ లో ఉన్న రూ.15కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దిశ, దుబ్బాక : దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు పెండింగ్ లో ఉన్న రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

దిశ, దుబ్బాక : దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులు పెండింగ్ లో ఉన్న రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. శనివారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన సీఎం సహాయనిధి 141 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోనిలోని ఉన్న 20 వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వం రూ,15 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే కొద్ది రోజులుగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పెండింగ్‌లో ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. 20 వార్డులలో డ్రెయినేజీ వ్యవస్థ సమస్యలను పరిష్కరించడానికి, ప్రతి వార్డుకు రూ,50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మంజూరు చేసిన నిధులతో స్థానిక మాజీ కౌన్సిలర్లు వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రామసముద్రం చెరువు కట్ట, పెద్ద చెరువు కట్ట, ఏదుల్లా చెరువు కట్ట లను సుందరీకరణం తీర్చిదిద్దేందుకు రూ,5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే డీపీఆర్ తయారు చేసి టెండర్లు వేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా ధర్మాజీపేట ఊరిలో నుంచి చేరువాపూర్ వెళ్లే బీట్ రోడ్డు కు రూ.4 కోట్లు మంజూరయ్యాయని.. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని రోడ్లు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యామేజ్ అయిన రహదారుల మరమ్మత్తుల కొరకు అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు కూడా మరమ్మతులు చేపట్టలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ రోడ్లు,ఆర్.ఆండ్.బీ రోడ్లు పూర్తిచేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.






