- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి
బైకు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన నుంగునూరు మండల కేంద్రంలో జరిగింది.

దిశ, నంగునూరు: బైకు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన నుంగునూరు మండల కేంద్రంలో జరిగింది. రాంపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల సాగర్(19) ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మరో యువకుడు ఎనగందుల విశాల్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి సాగర్, విశాల్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై నంగునూరు నుంచి రాంపూర్ వైపు వస్తుండగా మండల పరిషత్ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వెంటనే వీరిని నంగునూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఆర్‌విఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడు. అయితే లైసెన్స్ లేని వ్యక్తులకు బైకును ఇచ్చిన ఓనర్ పై సాగర్ తండ్రి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్ తెలిపారు.






