గుల్షన్ క్లబ్ కు నోటీసులు.. ఆరోపణలపై వివరణ

by Disha Web Desk 1 |
గుల్షన్ క్లబ్ కు నోటీసులు.. ఆరోపణలపై వివరణ
X

దిశ, మెదక్ ప్రతినిధి: కొందరి గుప్పిట్లోనే గుల్షన్ క్లబ్ అనే కథనంపై మెదక్ గుల్షన్ క్లబ్ అధ్యక్షుడు, మెదక్ ఆర్డీవో సాయిరాం స్పందించారు. దిశ పత్రికలో వచ్చిన ఆరోపణలపై పూర్తి వివరాలు ఇవ్వాలని బుధవారం నోటీసులు జారీ చేశారు. మెదక్ గుల్షన్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకుండా కేవలం ఆరుగురు కమిటీ మాత్రమే క్లబ్ కొనసాగుతోంది. క్లబ్ సభ్యులు ఎన్నికలు నిర్వహించాలని, అందులో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని ఇప్పటికే పలువురు ఫిర్యాదు సైతం చేశారు.కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా అద్దెల అగ్రిమెంట్ గడవు ముగిసిన కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతి నెలా వచ్చే అద్దె డబ్బులో కూడా వాటాల మూటలు ముడుపుల రూపంలో పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఆదాయం ఎంత.. ఖర్చు ఎంత.. బ్యాలెన్స్ ఎంత అనే లెక్కలు ఇవ్వడం లేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ అద్దెలు ఇవ్వడం లేదన్న కారణం మాత్రమే చెబుతున్నారు. కానీ, ఎందుకు అద్దె డబ్బు రావడం లేదో చెప్పడం లేదు. గతంలో సభ్యత్వం కోసం సభ్యుల నుంచి తీసుకున్న డబ్బుతో పాటు క్లబ్ కు సంబంధించిన లెక్కల్లో అవకతవకలు ఉండడం వల్ల కొంతమంది ఎన్నికలు నిర్వహించకుండా మోకాలు అడ్డుకుంటున్నారని వాపోతున్నారు.

క్లబ్ ఎన్నికలకు అడుగు ముందుకు పడేనా..

క్లబ్ లో ఎన్నికలు జరిగి ఏడేళ్లు అవుతున్నా.. మళ్లీ ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదనే విషయం ఎవరది అంతుబట్టడం లేదు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు, డీఎస్పీ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుడుగా ఉండే క్లబ్ లో అంత పారదర్శకంగా ఉండాలి. ప్రతిదీ వారి పర్యవేక్షణలో కొనసాగాలి. 300 మందికిపైగా సభ్యుల్లో ఉద్యోగులు, వ్యాపారులు, జర్నలిస్ట్ లు, సీనియర్ సిటిజన్స్ సభ్యులుగా ఉన్నారు. సభ్యులుగా అందరూ చదువుకున్న వారు ఉన్నా.. క్లబ్ లో పెత్తనం కొందరికి మాత్రమే పెత్తనం ఇవ్వడం గమనార్హం.

మూడేళ్లుగా కేవల ఆరుగురు సభ్యుల అధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహణ ఏమిటి అనే వాటికి అధికారులు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని మెజారిటీ సభ్యులు కోరుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కొంతమంది సభ్యులు అధికారులకు వినతి పత్రం కూడా అందజేశారు. నోటీసులు కాకుండా ఎన్నికలు నిర్వహిస్తే క్లబ్ లో ఉన్న అక్రమాలు వెలుగులోకి వస్తాయని కొంతమంతి సభ్యులు వాపోతున్నారు.

Next Story

Most Viewed