కేసీఆర్, బీఆర్ఎస్ ను క‌నుమ‌రుగు చేయ‌డం ఎవ్వ‌రిత‌రం కాదు : ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, సంగారెడ్డి అర్బన్ : కేసీఆర్, బీఆర్ఎస్ ను క‌నుమ‌రుగు చేయ‌డం ఎవ్వ‌రిత‌రం కాదు అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల

కేసీఆర్, బీఆర్ఎస్ ను క‌నుమ‌రుగు చేయ‌డం ఎవ్వ‌రిత‌రం కాదు : ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : కేసీఆర్, బీఆర్ఎస్ ను క‌నుమ‌రుగు చేయ‌డం ఎవ్వ‌రిత‌రం కాదు అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేర‌కు న‌వంబ‌ర్ 29న దీక్షా దివాస్ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో కీల‌క నేత‌ల‌తో ఇవాళ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దీక్షా దివాస్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేదా అని ఆలోచించాలి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను కనుమరుగు చేయడం ఎవరి తరం కాదన్నారు.తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో అనే గొప్ప త్యాగ నిరతితో దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేసారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మహా రెడ్డి భూపాల్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, శ్రీకాంత్ గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం , బాల్ రాజ్, మెట్టు కుమార్ ,మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డా శ్రీహరి, పట్టణ కార్యదర్శి పేరమళ నర్సింలు, వివిధ నియోజకవర్గాల ముఖ్య నాయకులు ఉన్నారు.

Next Story