విధుల్లో నిర్లక్ష్యం.. అధికారులకు షోకాజ్ నోటీసులు..

by Disha Web Desk 11 |
విధుల్లో నిర్లక్ష్యం.. అధికారులకు షోకాజ్ నోటీసులు..
X

దిశ, సంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు మండల పంచాయతీ అధికారులకు, ఒక పంచాయతీ కార్యదర్శికి చార్జీ మెమోలను జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ జారీ చేశారు. వారితో పాటుగా అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో విఫలమైన మరో పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడంతో పాటు మరో కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మనూర్ మండల ఎంపీఓ ఎండీ అహ్మద్ హుస్సేన్, నారాయణఖేడ్ ఎంపీఓ పి.వెంకటేశ్వర్ రెడ్డి, రుద్రార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలు గ్రామ పంచాయతీలలో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్న అరికట్టడంలో విఫలమైనందున వారికి కలెక్టర్ శరత్ చార్జ్ మెమోలు జారీ చేసినట్లు డీపీఓ తెలిపారు.

అలాగే మనూర్ మండలం బోరంచ గ్రామ కార్యదర్శి కూడా పట్టపగలు వీధి లైట్ల వెలుగును అరికట్టడంలో విఫలమైనందున కార్యదర్శి సాయన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు. రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయడంలో విపలమైనందున గ్రేడ్ -4 గ్రామ కార్యదర్శి వి.సంగయ్య స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారని వివరించారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీపీఓ సురేష్ మోహన్ హెచ్చరించారు.



Next Story

Most Viewed