సోషల్ మీడియాకు దూరంగా ఉండండి

by Bhanu |

చిన్నమైల్ అంజిరెడ్డి రామచంద్రపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మంగళవారం నూతన లైబ్రరీని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి
X

దిశ, రామచంద్రాపురం: విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివి తల్లిద్రండ్రులకు,వారి ప్రాంతానికి మంచి పేరు తీసుకొనిరావాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మంగళవారం నూతన లైబ్రరీని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎంఈఓ రాథోడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Next Story