- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"కన్నీళ్లు పెట్టిస్తా".. 'చెన్నై లవ్ స్టోరీ'పై సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
"మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించకుండా థియేటర్ నుంచి బయటికి రానివ్వను" అని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూలై 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని 'జిగితారా' పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాయి రాజేష్ మాట్లాడుతూ.. "చాలామంది ఈ సినిమా 'బేబీ'లా ఉంటుందని అంటున్నారు.
కానీ ప్రతిసారి 'బేబీ'లా జరగదు. మీరు ఈ సినిమా ఎక్కడ ముగుస్తుందని అనుకుంటారో, అక్కడే మా సినిమా ఇంటర్వెల్ అవుతుంది. సెకండాఫ్‌లో ప్రేక్షకులను కట్టిపడేసే భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించకుండా థియేటర్ నుంచి బయటికి రానివ్వను" అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో 'చెన్నై లవ్ స్టోరీ' సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, ఎస్.కె.ఎన్ మరియు సాయి రాజేష్ మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






