ఎమ్మెల్యే సునీత రెడ్డి గ‌న్ మెన్లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను నెట్టేయ‌డం వ‌ల్ల‌నే గొడ‌వ : కాంగ్రెస్ అభ్య‌ర్థి అనిత

by Ratna Kumari |

దిశ‌, కొల్చారం : రంగంపేటలో ఉద్రిక్తత కు కారణం ఎమ్మెల్యే అనుచరులే అని కాంగ్రెస్ బలపరిచిన రంగంపేట

ఎమ్మెల్యే సునీత రెడ్డి గ‌న్ మెన్లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను నెట్టేయ‌డం వ‌ల్ల‌నే గొడ‌వ : కాంగ్రెస్ అభ్య‌ర్థి అనిత
X

దిశ‌, కొల్చారం : రంగంపేటలో ఉద్రిక్తత కు కారణం ఎమ్మెల్యే అనుచరులే అని కాంగ్రెస్ బలపరిచిన రంగంపేట సర్పంచ్ అభ్యర్థి గొండ అనిత, మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ లు అన్నారు. గ్రామపంచాయతీ ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆటపాటలతో పక్కన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. సునీత రెడ్డి కాన్వాయ్ వెళ్లేందుకు పక్కన రోడ్డు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే గన్మెన్ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మహిళలను నెట్టి వేయడంతో గొడవ జరిగింది అని తెలిపారు. గొడవకు ఎమ్మెల్యే గన్ మెన్లు, ఆమె అనుచరులే కారణమని వారు ఆరోపించారు.

Next Story