ఓపెన్ జిమ్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

by Bhanu |

ప్రజలకు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం కోసం ఓపెన్ జిమ్‌లు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

ఓపెన్ జిమ్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ, పటాన్ చెరు టౌన్: ప్రజలకు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం కోసం ఓపెన్ జిమ్‌లు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మైత్రి మైదానం, కృషి డిఫెన్స్ కాలనీ, సింఫనీ కాలనీలలో 66 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను ఆయన ప్రారంభించారు. నూతన కాలనీలలోనూ ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఆయా కాలనీల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story