MLA Gudem Mahipal Reddy : మార్కెట్ యార్డ్ నిర్మాణానికి నిధులు ఇవ్వండి

by Chintha Aamani |

పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన

MLA Gudem Mahipal Reddy : మార్కెట్ యార్డ్ నిర్మాణానికి నిధులు ఇవ్వండి
X

దిశ,పటాన్ చెరు : పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన దుకాణ సముదాయల నిర్మాణానికి నిధులు కేటాయించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి, పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న నూతన దుకాణాల సముదాయం నిర్మాణ పనులకు సంబంధించిన నిధుల అంశంపై చర్చించి, నిధుల విడుదలకు ఆదేశాలు జారీచేయాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 20 కోట్ల 40 లక్షల వ్యయంతో 168 దుకాణాల సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. నిధుల కొరత మూలంగా పనులు మధ్యలోనే నిలిపివేయడం జరిగిందని, వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story