- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం
దిశ, హుస్నాబాద్ : డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. అక్కన్నపేట రోడ్డు లో ఏర్పాటు చేస్తున్న

దిశ, హుస్నాబాద్ : డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. అక్కన్నపేట రోడ్డు లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావొచ్చని భావిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు, సమీప రహదారుల అభివృద్ధి, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణను సభలో వివరించనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు అని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ, ఉపాధి, ఇరిగేషన్ తదితర రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పర్యటన ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా సభకు హాజరుకానున్నారని వెల్లడించిన ఆయన, నియోజకవర్గ ప్రజలంతా సభకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.






